మోదీతో కలసి హోళీ ఆడనున్న వితంతువులు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీతో కలసి హోళీ ఆడనున్న వితంతువులు

February 28, 2018

హోళీ సంబరాలు దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో ఎక్కువ. పిల్లా పెద్దా అంతా కలసి రంగులు పులుముకుంటారు. అయితే కొన్ని కట్టుబాట్ల వల్ల వితంతువులు ఈ వేడుకకు దూరంగా ఉంటారు. ఈసారి బృందావన్‌లోని వితంతువులు దీన్ని తుంగలో తొక్కారు. వారు ప్రధాని నరేంద్ర మోదీతో కలసి రంగులు చల్లుకుంటూ హోళీ ఆడనున్నారు.అయితే వీరు ఢిల్లీలో ఈ వేడుకు చేసుకుంటారు. దీని కోసం ఐదుగురు వితంతువులు బుధవారం ఢిల్లీకి బయల్దేరారు.  కుండల నిండుగా గులాల్‌(రంగు)  పట్టుకెళ్లారు. వారు వాటిని మోదీకి అందజేస్తారు. తర్వాత ఆయనతో కలసి హోళీ ఆడతారు. ప్రధాని ఆడే ఈ అరుదైన అవకాశం రావడంపై వారు ఉబ్బుతబ్బిబ్బవుతున్నారు. వీరు ఢిల్లీ వెళ్లే ముందు కూడా బృందావనంలోనూ రంగులు చల్లుకుని హోళీ ఆడారు. సంప్రదాయాలను ధిక్కరించి వేడుక చేసుకున్నారు.

‘కలలో కూడా ఊహించలేదు. వితంతువులు బాధలు అన్నీ ఇన్నీ కావు. కాస్త సంబరం కూడా ఉండదు.. కానీ మోదీతో ఈ అవకాశం రావడం సంతోషంగా ఉంది..’ అని అని ఛాబి శర్మ అనే వితంతవువు చెప్పింది. బృందావన్ వితంతువులు కొన్నాళ్లుగా సంప్రదాయాలను ఛేదిస్తున్నారు. ఒక వితంతువుకు పెళ్లి చేశారు.