మోదీ భార్యకు గాయాలు.. హైవేపై ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ భార్యకు గాయాలు.. హైవేపై ప్రమాదం

February 7, 2018

ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమె గాయాలయ్యాయి. జశోద రాజస్థాన్‌లోని కోటాలో నిర్వహించిన ఓ వేడుకకు హాజరై తిరిగి గుజరాత్‌కు వస్తుండగా బుధవారం ఉదయం కోట-చిత్తూర్ హైవేపై  ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు. జశోదను వెంటనే  చిత్తోడ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం ఎలా జరిగిందో ప్రస్తుతానికి తెలియడం లేదు. జశోద మెహసానాలోని ఉంఝా పట్టణంలో తన సోదరుడు అశోక్ మోదీతో కలసి నివసిస్తున్నారు. ఆమెకు జిల్లా పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు.