కేటీఆర్ కు  మోడీ లేఖ..! - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ కు  మోడీ లేఖ..!

September 14, 2017

ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ఐటి మినిస్టర్ కేటీఆర్ కు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు ‘మిషన్‌ భగీరథ’ గురించి మోడీ లేఖలో రాశారు. అంతే కాదు  ’స్వచ్చత హీ సేవా’ అనే కార్యక్రమాన్ని ప్రమోట్ చేయ్యాల్సిందిగా కేటీఆర్ ను  కోరారు. ఈసందర్భంగా తెలంగాణాలో చేపట్టిన ప్రాజెక్టులను అభినందించారు. ‘స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌’ ప్రారంభమై  మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్‌ 15 నుంచి చేపట్టనున్న ’స్వచ్ఛత హీ సేవా’ను విజయవంతం చేయాలని మోడీ సూచించారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛభారత్‌ కోసం అందరం కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ఈ లెటర్ ను కేటీఆర్ తన ట్విట్టరో పోస్ట్ చేశారు..