జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.. అని కదా అర్థం..మరి టైటిల్ ఏంటీ అలా ఉంది అనుకుంటున్నారా..?అది జీఎస్టీకి మరో కొత్త అర్థం. ఇది చెప్పింది ఎవరో కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..ఎందుకంటే.. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తే ఎలాంటి మంచి సాధ్యమవుతుందో చెప్పడానికి జీఎస్టీయే నిదర్శనమన్నారు. జీఎస్టీ అంటే గ్రోయింగ్ స్ట్రాంగర్ టుగెదర్ అని, దాన్ని స్ఫూర్తితో అన్ని పార్టీలు కలిసి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాలు భూమికి కొత్త అందాన్ని ఎలా తెస్తాయో.. వర్షాకాల సమావేశాలు కూడా అలాంటి ఫలితాలు తీసుకురావాలని ఆశించారు మోదీ.