మోదీజీ మాకు మద్దతు ఇవ్వండి: జెలెన్ స్కీ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీజీ మాకు మద్దతు ఇవ్వండి: జెలెన్ స్కీ

February 26, 2022

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ప్రకటించారు. “మా భూ భాగంలోకి రష్యాకు చెందిన ఆక్రమణదారులు దాదాపు లక్ష కంటే ఎక్కువ మంది ప్రవేశించారు. మా నివాస ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారు. దయచేసి మీ సహాయం మాకు కావాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మా దేశానికి మద్దతు ఇవ్వండి. ఈ దురాక్రమణను ఆపండి” అంటూ కోరాడు.

 

మరోపక్క రష్యా దురాక్రమణ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఇప్పటికే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సైతం తమ దేశానికి భారత్ మద్దతు ఇవ్వాలని కోరాడు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం మోదీ సహాయాన్ని కోరడం చర్చానీయాంశంగా మారింది.