Modi's birthday among African leopards
mictv telugu

ఆఫ్రికా చిరుతల మధ్య మోదీ బర్త్ డే

September 15, 2022

మన దేశంలోకి దాదాపు 70 ఏళ్ళ తర్వాత ప్రత్యేక అతిథులు రాబోతున్నాయి. వారికి ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చే ఈ అతిథులను తరలించడానికి ఆర్మీ హెలికాప్టర్లను రెడీ చేశారు. ఇంత హడావుడి ఎవరో వీఐపీ కోసం అనుకుంటే పొరపాటే. మన దేశంలో అంతరించిపోయిన చిరుతలను ప్రత్యేకంగా ఆఫ్రికా దేశం నమీబియా నుంచి రప్పిస్తున్నారు. ఏకధాటిగా పది గంటలు ప్రయాణించి రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం విమానం ల్యాండవుతుంది. అందులో ఐదు ఆడ, మూడు మగ చిరుతలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి తరలించి సైనిక హెలికాప్టర్‌లో మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో ఉంచుతారు. వాతావరణం అలవాటు కావడానికి నెల పాటు వాటిని ఏకాంతంగా ఉంచి తర్వాత అడవిలోకి వదులుతారు. అటు శనివారం తన పుట్టినరోజు వేడుకలను ప్రధాని మోదీ వీటి మధ్యే జరుపుకోనున్నారు. కాగా, వేటగాళ్ల తాకిడి, అడవులు అంతరించిపోవడం, రక్షణ కరువవడంతో చిరుతలు మన దేశంలో అంతరించిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం 1952లో అధికారికంగా ప్రకటించింది.