Modi's key remarks on petrol and diesel
mictv telugu

పెట్రోలు, డీజిల్‌ ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలు

April 27, 2022

పెట్రోలు, డీజిల్ ధరలపై ఉన్న వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. బుధవారం దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి సంబంధించి, అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఆయన వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  కరోనా కట్టడికి సంబంధించిన విషయాలతో పాటు, పెట్రోల్, డీజిల్ పెరుగుదల గురించి, పరిష్కారాల గురించి ఆయన వారితో చర్చించారు.

మోదీ మాట్లాడుతూ.. “పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలే కార‌ణం. రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్‌ను త‌గ్గిస్తేనే పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి. కేంద్రం, రాష్ట్రాలు క‌లిసి ప‌నిచేస్తేనే ధ‌ర‌లు త‌గ్గుతాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించినా, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం వ్యాట్‌ను త‌గ్గించ‌డం లేదు. తెలంగాణ‌, ఏపీ, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్ త‌గ్గించ‌డం లేదు. వ్యాట్ త‌గ్గించ‌ని కార‌ణంగానే పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికైనా పెట్రోల్‌, డీజిల్ రేట్లను తగ్గించండి” అని మోదీ సూచించారు.