Mohammed Shami's Wife Hasin Jahan Appeals To PM Modi , Amit Shah
mictv telugu

దేశం పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ భార్య రిక్వెస్ట్

August 15, 2022

భారత స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సంబురాలు మిన్నంటిన వేళ.. టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ సోషల్‌మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భర్త షమీతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న జహాన్‌.. దేశం పేరు మార్చాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను అభ్యర్ధిస్తూ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన హసిన జహాన్.. అందులో సంతల్య్, సోనియాలతో కలిసి ‘దేశ్ రంగీలా’ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ పోస్ట్ క్యాప్షన్‌గా దేశం పేరు మార్చాలని కోరింది. మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్… మనదేశం పేరు భారత్ అని గానీ హిందూస్తాన్ అని గానీ ఉండాలి. గౌరవ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి. ప్రస్తుతం మనం పిలుస్తున్న ఇండియా పేరు మార్చి భారత్ అని గానీ లేదా ‘హిందుస్తాన్’ అని గానీ పెట్టండి. అప్పుడు ప్రపంచం మొత్తం అదే పేరుతో పిలుస్తుంది… అని హిందీలో హసిన్ జహాన్ రాసుకొచ్చింది. కొంతమంది ఈ రిక్వెస్ట్ ను తలా తోకా లేని రిక్వెస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.