Mohammed Siraj, Umran Malik Refuse to Apply Tilak, get Trolled
mictv telugu

బొట్టు పెట్టుకోవడానికి నిరాకరించిన భారత్ బౌలర్లు…ఆ ఇద్దరిపై ట్రోలింగ్

February 4, 2023

Mohammed Siraj, Umran Malik Refuse to Apply Tilak, get Trolled

భారత్ క్రికెటర్స్.. టోర్నీల కోసం దేశ, విదేశాలలో పర్యటిస్తారన్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌లు కోసం ముందగా అక్కడికి చేరుకుని ఓ హోటల్ గదిలో బస చేస్తారు. ఇక తమ హోట్‎ల్‎కు వచ్చే క్రికెటర్లకు అక్క సంప్రదాయాల ప్రకారం ఆహ్వానం అందుతుంది. కొన్ని ప్రదేశాల్లో డప్పులు, వాయిద్యాలతో ఆహ్వానం పలికితే..మరికొందరు బొట్టు పెట్టి..దండం పెడుతూ ఆతిథ్యం అందిస్తారు. తాజగా బయట పడిన వీడియోలో ఓ హోటల్ సిబ్బంది క్రికెటర్లకు కుంకుమ బొట్టుపెట్టి లోపలికి ఆహ్వానించారు.

ఈ సమయంలో భారత్ క్రికెటర్లతో పాటు సిబ్బందికి బొట్టు పెడుతూ వస్తున్నారు. అయితే టీం ఇండియా బౌలర్స్ మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ మాత్రం బొట్టుపెట్టుకునేందుకు నిరాకరించారు. దీంతో వారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. భారతదేశంలో అతిథులకు నుదుట తిలకం దిద్ది స్వాగతం పలకడం హిందూ సంప్రదాయమని..దానిని ఎందుకు నిరాకరించారంటూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఆటగాళ్లు తమ మతంపై ఎందుకు అంత మతోన్మాదంగా ఉన్నారని విమర్శిస్తున్నారు.

సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లతోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో మరోకరు కూడా తిలకం పెట్టించుకోవడానికి నిరాకరించారు. అయినా ఆన్ లైన్ లో అభిమానులు మాత్రం సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లనే మాత్రేమే టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ఎప్పుడు తీసింది ఇంకా తెలియరాలేదు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం జట్టు నాగ్‌పూర్ చేరినప్పుడు ఈ ఘటన జరిగిందా? లేక అంతకుముందు జరిగిన పాత ఘటనా? అనేది తెలియాల్సి ఉంది.