తన పని మనిషి సారథిని అన్న విష్ణు కొట్టాడంటూ మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకునే మోహన్ బాబు ఫ్యామీలీలో కొడుకులే ఇలా రచ్చకెక్కారంటూ పలువురు కామెంట్ల రూపంలో సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు అన్నదమ్ముల మధ్య సమస్యను.. ఇలా ఫేస్‌బుక్ స్టాటస్‌లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారట. మనోజ్ అనాలోచితంగా చేసిన పని ఇప్పుడు ఫ్యామీలీ మొత్తాన్ని ఇరకాటంలో పడేసినట్లయిందని వార ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
నిజానికి మంచు బ్రదర్స్ బయట బాగానే ఉంటున్నా.. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని పుకార్లు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదని.. అందుకే మంచు మనోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడనేది ఇండస్ట్రీలో ఉన్నటాక్. అయితే ఇప్పుడు వారి మధ్య వివాదం రోడ్డున పడింది. నిన్న రాత్రి అన్న విష్ణు.. తన సహాయకుడు సారథితో జరిగిన గొడవ వీడియోను తన ఫేస్‌బుక్ స్టేటస్‌లో పెట్టాడు మనోజ్. ఇళ్ళలోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడటూ విష్ణు పై మనోజ్ ఆ వీడియోలో చెప్పడం రచ్చగా మారింది. ఈ గొడవపై నటుడు, వారి తండ్రి మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు. సోషల్‌మీడియాకు ఎందుకు ఎక్కారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గురువారం రాత్రి సారథి ఇంట్లో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారట. వీడియో డిలీట్ చెయ్యమని మనోజ్‌కు మోహన్‌బాబు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వీడియోను మంచు మనోజ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన కాసేపటికే డిలీట్ చేశారు.