Mohan Babu paid tribute to Krishna
mictv telugu

నరేశ్, పవిత్రా లోకేశ్ జంట నివాళి.. వెక్కి వెక్కి ఏడ్చిన మోహన్ బాబు

November 15, 2022

Mohan Babu paid tribute to Krishna

టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు సినీ ప్రముఖులు బారులు తీరారు. నిర్జీవంగా పడి ఉన్న కృష్ణ పార్థీవదేహాన్ని చూసి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నివాళులర్పించేందుకు రాగా, భౌతిక కాయాన్ని చూసి ఎమోషన్‌‌కు లోనయ్యారు. సోదరా సోదరా అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. కష్టకాలంలో తనను ఆదుకున్న ఆయన మంచి మనసును మరోసారి గుర్తు చేసుకున్నారు.

పక్కవారు ఓదార్చే ప్రయత్నం చేసినా బాధను నియంత్రించుకోలేకపోయారు. అనంతరం మహేశ్ బాబును హత్తుకుని ధైర్యం చెప్పారు. ఇక నరేశ్, పవిత్రా లోకేశ్ జంట కృష్ణకు నివాళులర్పించారు. అనంతరం వారు కారులో బయల్దేరిన వీడియో ఒకటి విడుదలయింది. మోహన్ బాబు నివాళులర్పించే సమయంలో ఈ జంట అక్కడే ఉండగా, మోహన్ బాబు మహేశ్ వద్దకు వెళ్ళే సమయంలో ఆయనను ఈ జంట అనుసరించడం వీడియోలో చూడవచ్చు. కాగా, కొన్ని నెలల ముందు ఈ జంట తమకు కృష్ణ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకోవడం తెలిసిందే.