Mohan Babu teaches lesson Manchu Vishnu family trolls
mictv telugu

మంచు విష్ణుకు ‘నాన్నగారు’ క్లాస్.. కామెడీ అస్సలు మిస్సవ్వొద్దు..!

October 17, 2022

Mohan Babu teaches lesson Manchu Vishnu family trolls

మంచు ఫామిలీ ట్రోల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంటాయి. మనోజ్‌¡పై కాస్త కనికరం చూపినా.. విష్ణు, లక్ష్మి ప్రసన్న, మోహన్ బాబులను మొహమాటం లేకుండా ట్రోలర్స్ ఆడుకుంటారు. మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తరువాత మంచువారి ట్రోల్స్ పీక్స్‌కు చేరాయి. దాంతో ఆ తరువాత విడుదలైన సన్ ఆఫ్ ఇండియా డిజాస్టర్ అయింది. ఈ సినిమాపై ట్రోల్స్ ప్రభావితం భారీగానే పడిందంటారు క్రిటిక్స్. ఇక ఆ తరువాత ట్రోలింగ్ చేసే వారిపై మంచు విష్ణు కేసులు కూడా పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు ఒక్కటంటే ఒక్క హిట్ కోసం మంచు విష్ణు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మంచు విష్ణు తాజా చిత్రం జిన్నా విడుదలకి సిద్దమవుతుంది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో మునుపటంతా కాకున్నా.. ఎప్పటిలానే స్టేజిపై తండ్రీ కొడుకులు ఓవర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఒకానొక స్టేజిలో మంచు విష్ణు వ్యాఖ్యలపై మోహన్ బాబు అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఈవెంట్‌లో ఎవరు ఎక్కువ సమయం మాట్లాడొద్దని మంచు విష్ణు చెప్పటాన్ని తప్పు పట్టారు పెదరాయుడు. అన్నగారు ఎన్టీఆర్ మూవీ ఫంక్షన్లో గానీ, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు సినిమా ఫంక్షన్లలో ఎవరూ ఇన్ని నిమిషాలే మాట్లాడాలనే కండిషన్ పెట్టలేదన్నారు. కానీ, విష్ణు మీరు ఇంత సేపే మాట్లాడాలని చెప్పడంతో షాకయ్యానన్నారు. అంటే నేను వేదికపై ఎక్కువగా మాట్లాడతానా అని తనకు అనిపించిందన్నారు. ఇక విష్ణు చిత్రాన్ని ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు సినిమా ఫంక్షన్ల తో మోహన్ బాబు పోల్చేశాడు. ఆ తరువాత విష్ణు మాట్లాడుతూ.. మా నాన్నలో నాకు కోపం అస్సలు నచ్చదని బహిరంగంగా చెప్పేశాడు. ఏదేమైనా నిన్నటి ఈవెంట్ లో కాస్త కామెడీ తగ్గినా.. సోషల్ మీడియాకి మాత్రం సరిపోను కంటెంట్ దొరికేసినట్టే.