చిరంజీవి సినిమాలో విలన్‌గా మోహన్ బాబు... - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవి సినిమాలో విలన్‌గా మోహన్ బాబు…

February 4, 2020

hb fv

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ సినిమాలో నటించడానికి మోహన్ బాబు ఒపుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

ఒకవేళ మోహన్ బాబు ఒప్పుకుంటే ఆయన ఈసినిమాలో విలన్‌గా కనపడే అవకాశం ఉంది. ఈ ఇద్దరూ ఇది వరకు ‘బిల్లా రంగా’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రాల్లో హీరోలుగా కలిసి నటించారు. అంతేకాదు చిరంజీవి హీరోగా నటించిన కొన్ని చిత్రాల్లో మోహన్‌బాబు విలన్‌గా నటించాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించడానికి రంగం సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యాడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో రెజినా కసాండ్ర ఆడిపాడనుందని సమాచారం.