ముస్లింలు కూడా హిందువులే: ఆరెస్సెస్ చీఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలు కూడా హిందువులే: ఆరెస్సెస్ చీఫ్

December 18, 2017

భారత దేశంలో ఉన్నవారందరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం త్రిపురలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఈ దేశంలోని ముస్లింలు కూడా హిందువులే.. అందరూ జాతి నిర్మాణంతోపాటు స్వావలంబన, స్వయం అభివృద్ధి కోసం ఆరెస్సెస్¡లో చేరాలి..’ అని పిలుపునిచ్చారు.

‘భారత్ అంటేనే హిందువుల భూమి.  ప్రపంచంలో పలు దేశాల్లో వేధింపులకు గురైన హిందువులు భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. 947లో దేశ విభజన జరగడంతో హిందుత్వ స్ఫూర్తి దెబ్బతింది..’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వం అంటే అందర్నీ ఏకం చేసేదని, హిందుత్వం వేరు, హిందూ మతం వేరు అని అన్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, అందరూ బాగుపడాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం తన సమస్యల పరిష్కారం కోసం భారత్ వైపు చూస్తోందన్నారు.