కుర్రాడైన మోహన్‌లాల్..20 కిలోలు తగ్గాడు - MicTv.in - Telugu News
mictv telugu

కుర్రాడైన మోహన్‌లాల్..20 కిలోలు తగ్గాడు

December 15, 2017

మళయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒక్కసారిగా కుర్రాడిగా మారాడు. ఇదంతా ఓ సినిమాకోసమే. మోహన్ లాల్ ప్రస్తుతం ‘ఒడియన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఆసినిమాలో ఆయనది ఓ కుర్రాడి పాత్ర కావడంతో కొన్ని రోజులుగా బరువు తగ్గే ప్రయత్నం చేశాడు. నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేకమైన డైట్ ను పాటిస్తూ ఏకంగా 20కిలోల బరువు తగ్గాడు. 57 సంవత్సరాలున్న మోహన్ లాల్ ప్రస్తుత లుక్కుని చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈసినిమా తర్వాత 1000 కోట్ల బడ్జెట్‌తో విఎ శ్రీకుమార్ దర్శకత్వంలో నిర్మించనున్న మహాభారతంలో భీముడి పాత్రలో నటించబోతున్నాడు మోహన్ లాల్.