సిరాజ్ ఇప్పుడు పరిచయం అక్కరలేని పేరు. భారత పేసర్ గా శ్రీలంక చివరి వన్డేలోనే కాదు.. న్యూజిల్యాండ్ తో జరిగిన మొదటి వన్డేలోనూ తన సత్తా ఏంటో నిరూపించాడు. అయితే భారత క్రికెటర్ గా సిరాజ్ తన సొంత మైదానంలో ఆడడం ఇదే తొలిసారి. ఈ స్పెషల్ అకేషన్ ని మరింత స్పెషల్ చేసి ఒక వీడియో విడుదల చేసింది బీసీసీఐ.
A perfect and eventful day for @mdsirajofficial, who played his first international game at his home ground and had his family watching him sparkle for #TeamIndia with the ball 👏🏾👏🏾
Watch as his friends and family share their thoughts 🤗 #INDvNZ pic.twitter.com/AXPVWbxs9z
— BCCI (@BCCI) January 18, 2023
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ శ్రీలంకతో చివరి వన్డేలో 32 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ కుడిచేతి పేసర్ న్యూజిల్యాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా తన ప్రతాపం చూపించాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. భారత క్రికెటర్ గా సిరాజ్ తన సొంత గడ్డపై ఆడడం ఇదే తొలిసారి. మెన్ ఇన్ బ్లూ లో ప్రధాన వికెట్ టేకర్ గా గేమ్ ను పూర్తి చేయడం ద్వారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
హైదరాబాద్ లో అతని మొదటి ఆటను మరింత గుర్తుండిపోయేలా చేయడానికి అతని తల్లి, స్నేహితులు ఉత్సాహపరిచేందుకు స్టాండ్ లో ఉన్నారు. అతను ఎవరినీ నిరాశపరచలేదు. అతను 10 ఓవర్ల స్పెల్ లో 46 పరుగులు ఇచ్చి నలుగురు కివీ బ్యాటర్లను అవుట్ చేశాడు. ఆట ముగిసిన తర్వాత బీసీసీఐ వారి సామాజిక ఖాతాల్లో ఒక వీడియోను విడుదల చేసింది. పేసర్ కుటుంబం, స్నేహితులు అతని గురించి మాట్లాడడం, అతని ఆటను చూస్తున్నట్లు ఆ వీడియోలో ఉంటుంది.
సిరాజ్ తల్లి తన ముందు తన కొడుకు ప్రదర్శనను ప్రత్యక్షంగా చూడడం గర్వంగా ఉంది. పేసర్ భారతదేశం గర్వించేలా చేస్తాడని, రాబోయే ఆటల్లో కూడా అతని ప్రదర్శన బాగుంటుందని ఆశించింది. ఇదంతా తను హిందీలో చెప్పింది. ఈ వీడియోలో సిరాజ్ చిన్ననాటి స్నేహితులు కూడా ఉన్నారు. సిరాజ్ 2022లో ఓడీఐల్లో భారతదేశం తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, 2023లో కూడా అతని ప్రదర్శన మరింత మెరుగుపడింది. ఈ ఏడాది నాలుగు మ్యాచ్ ల్లో ఆడి మొత్తం 13 వికెట్లు తీశాడు.