మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమే - MicTv.in - Telugu News
mictv telugu

మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమే

September 6, 2017

తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఖాయమేనంటున్నాడు తండ్రి బాలయ్య. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అతని  సినీ ప్రవేశం గురించి ఆసక్తికర విషయాలను ప్రకటించారు బాలకృష్ణ. తన నియోజక వర్గమైన హిందూపురంలో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల అనంతరం బాలకృష్ణ తనయుడి ఎంట్రీ గురించి మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని అన్నారు. తనను ఆదరించినట్టే తన కుమారుణ్ని కూడా ఆదరించాలని కోరారు. ఇప్పటికే నలుగురు సీనియర్ హీరోలైన వారిలో చిరంజీవి, నాగార్జున తనయులు ఆల్ రెడీ ఎంట్రీ ఇచ్చారు. మిగిలింది బాలయ్య, వెంకటేష్ లే. తన కొడుకును ఇప్పుడప్పుడే హీరోను చెయ్యను, వాడింకా చిన్నవాడు చదువుకుంటున్నాడని వెంకీ చాలా సార్లు అన్నారు. ఇక బాలకృష్ణ వంతే వుండింది. మోక్షజ్ఞ పెద్దవాడైపోయాడు. తన నట వారసత్వాన్ని కొనసాగించే పనిలో వున్నారు బాలయ్య.