Joseph Manu James: సినీ ఇండస్ట్రీలో విషాదం..యువ డైరెక్టర్ కన్నుమూత..!! - Telugu News - Mic tv
mictv telugu

Joseph Manu James: సినీ ఇండస్ట్రీలో విషాదం..యువ డైరెక్టర్ కన్నుమూత..!!

February 27, 2023

ఈమధ్య సినీఇండస్ట్రీలో వరస విషాదాలు వెంటాడుతోన్నాయి. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న తారలు మరణిస్తుండటంతో సినీపరిశ్రమలో విషాదం నెలకొంటోంది. మొన్న నటుడు తారకరత్న మరణం…సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇంతలోనే మరో యువ దర్శకుడు జోసెఫ్ మన జేమ్స్ మరణించారు.

 

కేరళకు చెందిన యంగ్ డైరెక్టర్ మను జేమ్స్ అనారోగ్యంతో మరణించారు. ఆయన వయస్సు 31 సంవత్సరాలు. కొన్నిరోజులగా జాండీస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. గత రాత్ర తుదిశ్వాసవిడిచారు. ఆయన మరణంతో మళయాళ చిత్రసీమలో విషాదఛాయలు అలముకున్నాయి. మను జేమ్స్ నిర్మించిన తొలిమూవీ నాన్సీరాణి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంతలోనే ఆయన మరణించడం బాధాకరం. మను మళయాల ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. సాబు జేమ్స్ డైరెక్షన్ లో 2004లో రిలీజ్ అయిన అయామ్ క్యూరియస్ సినిమాలో నటించారు. ఆ తర్వాత మలయాళం, కన్నడ, బాలీవుడ్ సినిమాల్లో అసోసియేట్ డైరెక్ట్ గా పనిచేశారు.