చిక్కడు దొర్కడు…చిన్నోడు… పెద్దోడు…. అపూర్వ సహోదరులు…. ఇవన్నీ మన దగ్గర సిన్మ పేర్లు… అమెరికా న్యూజెర్సీలున్న అన్నదమ్ములు ఈ పేర్లకు సరీపోతరు. చెల్సియా అనేటామెకు కవల పిల్లలున్నరు. వాళ్ల పేర్లు గ్రీసన్, యూదా అల్డర్స్. వాళ్ల అల్లరికి తట్టుకోలేక వాళ్లను పేద్ద… ఊయలల వేసింది. వాళ్లు ఏం చేస్తున్నారో తెల్సుకుందామని వారిపై కెమెరా పెట్టింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకరు ఒకరు సాయం చేసుకుంటూ ఊయల నుండి తెలిగా బయట పడ్డారు. చాలా నేర్పుతో ఓర్పుతో ఊయలను దాటి బయటకొచ్చారు. ఇందులో వింతేం లేదనుకుంటున్నరా…. ఇద్దట్లో ఒకరు బయటకు వెళ్లాలని అనుకుంటరు… రెండో పిల్లాన్ని లేపి…. ఫస్ట్ అబ్బాయి బయట పడ్తాడు. తరవాత రెండో అబ్బాయీ వస్తాడు. ఇంత చిన్న యస్సులనే ఈ అపూర్వ సహోదారులు పరస్పర సహకారంతో అట్లా ముందుకు పోతున్నారు. ముందు ముందు ఏం చేస్తరో మరి. అయినా వీరి సమయ స్పూర్తిని చూడాల్సిందే…..