ఎలుగుబంటిని చూసి ఆనందంతో దగ్గరకు వెళ్లిన చిన్నారి.. షాకింగ్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఎలుగుబంటిని చూసి ఆనందంతో దగ్గరకు వెళ్లిన చిన్నారి.. షాకింగ్ వీడియో

May 28, 2022

చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. తాజాగా వాషింగ్టన్‌లో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. పసిపాప పట్ల ఆమె జాగ్రత్తగా ఉండనట్లయితే పెద్ద అనర్ధమే జరిగి ఉండేది, సియాటల్ లోని రెడ్‌మండ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ మహిళకు జునిపెర్ అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఓ రోజు మహిళ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆ పసిపాప ఆడుకునేందుకు ఇంటి బయటకు వచ్చింది. అదే సమయంలో వారి ఇంటి ప్రహరీ మీదికి ఓ చిన్న ఎలుగుబంటి వచ్చింది.దాన్ని చూసిన చిన్నారి.. ఆనందంతో దాని వైపు పరుగెత్తుకుంటూ వెళ్లింది. అనుమానం వచ్చిన తల్లి పాపం కోసం చూడగా.. అప్పటికే ఎలుగుబంటి దగ్గరకు వెళ్తూ ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్లిన మహిళ.. కుమార్తెను ఎత్తుకుని అంతే వేగంగా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.