momentum Hyderabad Real Estate
mictv telugu

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కు ఊపు

November 18, 2022

కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలలో తగ్గిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం పుంజుకుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గృహ, స్థిరాస్తి అమ్మకాళ్లు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పూణె, హైదరాబాద్‌ వంటి ఏడు నగరాల్లో రూ.1,55,833 కోట్ల విలువైన గృహాల విక్రయాలు జరిగాయి. మొదటి అర్ధ సంవత్సరంలో 119 శాతం వృద్ధితో ఈ విక్రయాలు జరిగినట్టు FY23 ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఒక నివేదికలో తెలిపింది. అదే విధంగా విక్రయించిన యూనిట్ల మొత్తం విలువ దాదాపు రూ.71,295 కోట్లు ఉన్నట్లు పేర్కొంది..

హైదరాబాద్‌లోనూ గృహాల విక్రయం మునుపటితో పోల్చితే జోరందుకుంది. మొత్తం గృహాల అమ్మకాల విలువలో భాగ్యనగరం 130 శాతం ఎగబాకింది. 2022-23లో రూ.6,926 కోట్ల నుండి రూ.15,958 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని ప్రథమార్థంలో హైదరాబాద్‌లో దాదాపు 22,840 గృహాలు విక్రయించబడ్డాయి. బెంగళూరులో 2022-23 మొదటి ఆర్థిక సంవత్సరంలో రూ. 17,651 కోట్ల విలువైన గృహాలు అమ్ముడయ్యాయి,