దుబ్బాక ఉప ఎన్నికలు : సిద్ధిపేటలో రూ. 7.50 లక్షల సీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాక ఉప ఎన్నికలు : సిద్ధిపేటలో రూ. 7.50 లక్షల సీజ్

October 13, 2020

mhmgh

దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారంతో పాటు ప్రలోభాలు కూడా ఊపందుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నగదు ఏరులై పారుతోంది. సిద్ధిపేట జిల్లా పరిధిలో పలు చోట్ల నగదు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలో రూ. 7.50 లక్షలను సీజ్ చేశారు. కారులో డబ్బులు తరలిస్తుండగా పోలీసు ఇవి తనిఖీల్లో బయటపడ్డాయి. ఆ డబ్బు ఎక్కడిదనే కోణంలో విచారణ చేపట్టారు. కలెక్టరేట్‌లోని ఎన్నికల కార్యాలయంలో వాటిని డిపాజిట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.  

పుల్లూరు గ్రామానికి చెందిన చొప్పదండి మణికంఠ కారులో రూ7.50 లక్షలను తీసుకెళ్తుండగా.. సిద్ధిపేట పోలీసులు పట్టుకున్నారు. దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో సొమ్మును పోలీసులు సీజ్ చేశారు.కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద 50 వేల రూపాయలకు మించి డబ్బులు తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కు వ తీసుకెళ్తే మాత్రం పక్కా ఆధారాలు ఉండాలని చెప్పారు. లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కాగా, ఇటీవలే శామీర్‌పేట సమీపంలో రూ. 40 లక్షలు పట్టుబడిన సంగతి తెలిసిందే.