Money seized in munugodu assembly bypoll
mictv telugu

మునుగోడులో కట్టలపాములు.. కోటి స్వాధీనం

October 17, 2022

మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మందు, ముక్క, నోటు వరదలై పారుతున్నాయి. సోమవారం తనిఖీల్లో కోటి రూపాయల నగదు దొరికింది. ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తుండగా అడ్డంగా బుక్కయింది. చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ బీజేపీ నేతకు చెందిన వాహనంలో ఈ దొరికినట్లు తెలుస్తోంది.

ఆ బండి కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంగా పోలీసులు గుర్తించారు. డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసుల నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిబంధనావాళి అమల్లో ఉన్నా ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మందు, ముక్క పంచున్నాయి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్లు మారింది వ్యవహారం. ఎన్నికల మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి కాబట్టే ఇలా జరుగుతోందని భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల హవాలా సొమ్మును పోలీసులు జప్తు చేయడం తెలిసిందే.