ఏటీఎంలో దొంగ కోతి.. ప్యానల్ పీకి, వీరోచితంగా పోరాడి (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఏటీఎంలో దొంగ కోతి.. ప్యానల్ పీకి, వీరోచితంగా పోరాడి (వీడియో)

May 7, 2020

Monkey ATM Broken in Delhi

ఏటీఎంలో దొంగలు పడి డబ్బులు ఎత్తుకెళ్లడం చూసి ఉంటాం. కానీ ఓ ఏటీఎం సెంటర్‌లో జరిగిన విధ్వంసం చూసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. ఓ కోతి దొంగలా మారి హంగామా సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఏటీఎంలోకి చొరబడి మిషన్‌ను ధ్వంసం చేసింది. ఆ సమయంలో ఓ వ్యక్తి రావడంతో అతన్ని చూసి పారిపోయింది. అయితే డబ్బులు మాత్రం ముట్టుకోకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

సౌత్‌ ఏవెన్యూలోని ఓ  ఏటీంఎంలోకి కోతి ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ కూడా లేకపోవడంతో తన బుద్ధిని చూపించింది. అందులో ఉన్న పోస్టర్లను పీకేస్తూ.. ఏటీఎం ప్యాన్ బలంగా లాగుతూ.. వీరోచితంగా దానితో పోరాడింది. పూర్తిగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రావడంతో పారిపోయింది. అతడు పోలీసులకు విషయం చెప్పడంతో వారు వచ్చి సీసీ ఫుటేజీ పరిశీలించారు. కోతి ఇలా ఎలా చేయగలిగిందని ఆశ్చర్యపోతున్నారు. కాగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో చాలా ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డులు ఉండటం లేదు.