కోతి బీభత్సం.. బైక్‌పై వచ్చి బాలికను కిడ్నాప్ చేసి (వీడియో)
కోతి బైక్‌పై వచ్చి చిన్నారిని కిడ్నాప్ చేయడం ఏంటని అనుకుంటున్నారా.? కానీ ఇది నిజంగానే జరిగింది. ఓ వానరం నిజంగానే వేగంగా మినీ బైక్‌పై దూసుకొచ్చి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసింది. బలవంతంగా ఆమెను లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ చివరి నిమిషంలో స్థానికులు అప్రమత్తం కావడంతో అది అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియదు కానీ.. ఇండోనేషియా నుంచి తొలిసారి ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టుగా తెలుస్తోంది.
We are surely living in strange times?
Broad daylight kidnapping attempt by monkey……VC- Rex pic.twitter.com/04grUaB4eY
— Susanta Nanda IFS (@susantananda3) May 4, 2020
ఈ వీడియోలో మినీ బైక్‌పై వేగంగా వచ్చిన కోతి.. పక్కనే కూర్చున్న పిల్లల వద్ద ఆగుతుంది. అంతే వేగంతో అక్కడ ఉన్న చిన్నారిని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. చెయ్యి జారిపోతుండటంతో డ్రస్ పట్టుకుని బలంగా కిందపడేసి మరీ తీసుకెళ్లింది. వెంటనే అదే సమయంలో స్థానికులు అలర్ట్ అవడంతో ఆమెను వదిలేసి పోయింది. ఆ చిన్నారి కూడా ఏమీ తెలియనట్టుగా వచ్చి మళ్లీ అదే బెంచ్ మీద కూర్చుంటుంది. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఇది ఒక్క భయం కల్పించే విషయమని అభిప్రాయపడుతున్నారు. కాగా ఇదంతా జరుగుతున్నంత సేపు అక్కడే కొంత మంది యువకులు కూడా ఉండటం విశేషం. ఇది ఎలా జరిగిందనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు.