కోతి కాళ్లను కోసేసిన దొంగలు.. - MicTv.in - Telugu News
mictv telugu

కోతి కాళ్లను కోసేసిన దొంగలు..

November 24, 2017

విశ్వాసానికి కుక్క ప్రతీక అంటారు. ఈ వార్త చదివితే కోతి కూడా ప్రతీకే అంటారు. కోల్‌కతాలో ఒక కోతి తన యజమానిపై అచంచలమైన విశ్వాసం చూపింది. అతుడు పెంచుతున్న పావురాలను చోరీ చేయడానికి వచ్చిన దుండగులతో భీకరంగా తలపడింది. ఆ ముష్కరులు.. మూగజీవి అని కూడా చూడకుండా దానిపై తీవ్రంగా దాడి చేశారు. చాకుతో దాని కాళ్లను  కోసేశారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఉదంతం కాశీపూర్ ఉదయ్బంతి ప్రాంతంలో జరిగింది. బుధవారం కోతి యజమాని విక్కీ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. తమ ప్రాంతానికే చెందిన మహ్మద్ నసీం, మరికొందరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, వారు ఇదివరకు కూడా తన పావురాలను దొంగిలించేందుకు యత్నించారని యాదవ్ తెలిపాడు. పోలీసులు నిందితులపై కేసుపెట్టారు