డ్రైవర్ ‘కోతి’ చేష్టలు.. దెబ్బకి సస్పెండ్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైవర్ ‘కోతి’ చేష్టలు.. దెబ్బకి సస్పెండ్

October 6, 2018

మానవ జాతికి మూలం వానరజాతి. రెండింటి మధ్య చాలా అనుబంధం ఉంది. కాకపోతే డోసెక్కువై చెడింది. ‘నేను కూడా బస్సు నడుపుతాను’ అని ఓ కోతి బస్సు స్టీరింగ్ పట్టుకుని ఎంతకూ వదల్లేదు. సరేలే ముచ్చపడుతుంది కదా అనుకున్న డ్రైవర్.. సదరు వానరంతో బస్సు నడిపించాడు. చివరకు సస్పెండ్ అయ్యాడు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కర్ణాటక  ఆర్టీసీ బస్సు డ్రైవర్ దావణగెరెలో కోతితో బస్సు నడిపించాడు. కోతి స్టీరింగ్‌పై కూర్చుని అటు ఇటు తిప్పితే.. డ్రైవర్ దాన్ని హ్యాండిల్ చేశాడు. ఈ తతంగాన్ని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వైరల్ అయ్యింది. కోతి చేసిన పని చూసి కొందరు నవ్వుకుంటుంటే.. మరి కొందరు మాత్రం బస్సు డ్రైవర్ ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం వహించారని మండిపడుతున్నారు. ఆ నోటా.. ఈ నోటా.. డ్రైవర్ చేసిన పని తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు.