పందికోతి పిల్లలు తయార్.. ప్రపంచంలోనే తొలిసారిగా..  - MicTv.in - Telugu News
mictv telugu

పందికోతి పిల్లలు తయార్.. ప్రపంచంలోనే తొలిసారిగా.. 

December 7, 2019

Monkey-pigs born  in china .

అవయవ దానంపై ఎంత ప్రచారం సాగుతున్నా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. మతాచారాలు, మూఢనమ్మకాల కారణంగా చాలామంది అవయవ దానానికి ముందుకు రావడం లేదు. దీంతో అవయవాలు అవసరమున్న రోగులు అర్ధంతరంగా కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా కళ్లు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు చాలా తక్కువగా లభ్యమవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి చైనా వైద్యులు సరికొత్త ప్రయోగం చేశారు. 

మనిషి జన్యువులతో దగ్గరి సంబంధం ఉండే కోతి, పందులను సంకరం చేసి ప్రపంచంలోనే తొలిసారిగా ‘కోతిపంది’ పిల్లలను పుట్టించారు. కోతులు, పందుల నుంచి డీఎన్ఏ సేకరించి పుట్టించిన వీటికి చిమెరా అనే పేరుపెట్టారు. బీజింగ్ లేబొరేటరీలో పుట్టిన ఇవి ఐదు రోజులు మాత్రమే బతికాయి. అయితే ప్రయోగాలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చిమెరాల శరీరంలో మానవ అవయవాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో వీటిని పుట్టించినట్లు పరిశోధనలో పాల్గొన్న తాంగ్ హాయ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. 

ప్రయోగం ఇలా.. 

ఐదు రోజుల పంది అండంలోకి కోతుల మూలకణాలను చొప్పించారు. తర్వాత పారదర్శక ప్రొటీన్ ఉత్పత్తి అయ్యేలా మరికొన్న ప్రయోగాలు చేశారు. అయితే ఐవీఎఫ్ ప్రక్రియలో లోపం వల్ల అవి చనిపోయాయని భావిస్తున్నారు. కాగా, ఈ ప్రయోగాలు నైతిక విలువలకు విరుద్ధమని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.