కరోనా టెస్ట్ శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి..స్థానికుల్లో వణుకు! - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా టెస్ట్ శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి..స్థానికుల్లో వణుకు!

May 29, 2020

Monkey

కరోనా మహమ్మారి కారణంగా జనాలు భయం భయంగా ఉంటున్నారు. ఈ విపత్కర సమయాల్లో కోతులు వాటి చర్యలతో జనాల్లో భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇటీవల మీరట్ లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. 

మీరట్ లో ఓ కోతి ముగ్గురు కరోనా అనుమానితుల టెస్ట్ నమూనాలను ఎత్తుకెళ్లింది. అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను ఓ ల్యాబ్ టెక్నీషియన్ మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. కాలేజీ ప్రాంగణంలో కోతుల గుంపు అతడిపై దాడి చేసింది. అతడి చేతిలో నుంచి కరోనా శాంపిల్స్‌ను ఓ కోతి ఎత్తుకెళ్లింది. దీంతో సదరు కరోనా అనుమానితుల నుంచి డాక్టర్లు మ‌రోసారి నమూనాల‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపించారు. కరోనా శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి చెట్టుపై కూర్చొని వాటిని నమిలింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ టెస్టింగ్ కిట్లలో క‌రోనా వైర‌స్‌ ఉండొచ్చేమోన‌ని, ఆ కోతులు వాటిని ఎక్కడ త‌మ ఇళ్లపై పడేస్తాయోమేన‌ని స్థానికులు భయపడుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే కోతులను అదుపులోకి తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.