మనుషుల కంటే కోతులే నయం.. విధిగా మాస్క్ ధరించింది - MicTv.in - Telugu News
mictv telugu

మనుషుల కంటే కోతులే నయం.. విధిగా మాస్క్ ధరించింది

July 9, 2020

Monkey Wearing Mask With Corona Fear

కొన్నిసార్లు మనుషుల కంటే కోతులే నయం అని అంటూ ఉంటారు. చాలా మంది ఇంగితం మరిచి చేసే పనులతో విసిగి ఇలాంటి మాటలు అనాల్సి వస్తుంది. మరోసారి ఆ మాట నిజమేనని రుజువు అయింది. కరోనా మహమ్మారి నివారణలో మాస్కులు ఎంతో ముఖ్యమని వైద్యులు చెబుతున్నా చాలా మంది పట్టించుకోవడం లేదు. కొంత మంది అయితే మాకేం కాదులే అన్నట్టుగా దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారికి పోలీసులు కూడా బుద్ధి చెబుతున్నారు. కానీ ఓ కోతి మాత్రం తాను మనుషుల మాదిరిగా కాదు అని నిరూపించింది. 

ప్రస్తుత భయానకర పరిస్థితులను అర్థం చేసుకొని తనకు తానుగా స్వచ్ఛందంగా మాస్కు ధరించింది. వైరస్ నుంచి రక్షించుకునేందుకు ఓ టవల్ మూతి, ముక్కు చుట్టూ  ధరించి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఐఎఫ్‌స్ అధికారి సుశాంతా నందా పోస్టు చేశారు. దీంతో సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. కాగా ఇప్పుడు ఎక్కడ ఎవర్ని చూసినా దాదాపు అంతా మాస్కుతోనే కనిపిస్తున్నారు. అలాగే ఈ కోతి కూడా మనుషులను అనుకరించడం విశేషం. ఎంతో మంది మాస్కులు ధరిస్తున్నా ఏం పట్టనట్టు వ్యవహరించే వారికి ఇవి మంచి గుణపాఠాన్ని నేర్పుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొందరు అయితే మనుషుల కంటే అవే బెటర్ అని అంటున్నారు.