Monkeypox alert..Follow these precautions: Central Govt
mictv telugu

మంకీపాక్స్‌ అలెర్ట్..ఏం చేయాలి, ఏం చేయొద్దు: కేంద్రం

August 3, 2022

భారతదేశంలో గతకొన్ని రోజులుగా మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్ విషయంలో ప్రజలకు కొన్ని జాగ్రత్తలను తెలియజేసింది. మంకీపాక్స్ సోకితే, ఏం చేయాలి? ఏం చేయాకూడదు? అనే వివరాలను వివరించింది.

చేయాల్సిన పనులు ఇవే..
”ముందుగా వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా, శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంత వరకు బాధితులను ఐసోలేషన్లో ఉంచండి. బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. బాధితులకు సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు, చేతులకు గౌజులు ధరించాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో గాని శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. బాధితులు ఉన్న ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి”

చేయకూడని పనులు ఇవే..
”మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు, టవళ్లు, పడకను కుటుంబంలో ఇతరులు వాడకూడదు. బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి ఉతక్కూడదు. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. తప్పుడు సమాచారం నమ్మి బాధితులపై వివక్ష చూపకూడదు” అని కేంద్ర ఆరోగ్యశాఖ ట్విటర్‌లో వెల్లడించింది

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 మందికి మంకీపాక్స్ సోకింది. ఈ వ్యాధి కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. తాజాగా కొన్ని సూచనలు కూడా చేసింది.