ప్రపంచంలో విపరీతంగా పెరిగిపోతున్న మంకీపాక్స్ కేసులు చాలావరకు సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారానే వ్యాప్తి చెందినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ కొత్త రకం వైరస్ వల్ల కెనడాలో 12, పోర్చుగల్లో 40, బ్రిటన్లో 9, అమెరికాలో 1 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. పురుషుల పరస్పర శారీరక కలయిక ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వైరస్ బారిపడ్డ వాళ్లను పరీక్షిస్తే స్పష్టమైంది.
ఈ మేరకు అమెరికా సీడీసీ ప్రకటన చేసింది. మరోవైపు యూకే ఆరోగ్య భద్రత సంస్థ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేసింది. గే సెక్స్ లో పాల్గొన్న వ్యక్తుల్లోనే మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు వెల్లడించింది. ‘‘పురుషుల పరస్పర శృంగారంతోనే వైరస్ వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయ్యింద’’ని డబ్ల్యూహెచ్వో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోసే ఫాల్ వెల్లడించారు.మంకీపాక్స్ బారినపడ్డ వాళ్లు కోలుకోవడానికి 15 రోజుల దాకా పట్టొచ్చు. ప్రాణభయం అంతగా ఏమీ ఉండదు. జ్వరం తరహా లక్షణాలతో మొదలయ్యే ఈ వైరస్.. జ్వరం, కండరాల నొప్పులు, ఒంటి మీద దద్దుర్లుతో ఇబ్బంది పెడుతుంది. మంకీపాక్స్ వైరస్ను మనీపాక్స్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లూ ‘ఆర్థోపాక్స్ వైరస్’ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది.