Monkeypox virus.. drug clinical trial started
mictv telugu

మంకీపాక్స్ వైరస్.. డ్రగ్ క్లినికల్ ట్రయల్ మొదలు

August 24, 2022

ప్రపంచంలోని 80 దేశాలకు పాకిన మంకీపాక్స్ వైరస్‌కు మందు కనుగొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్ సర్ పీటర్ హోర్బీ నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రయోగానికి ‘ప్లాటినం’ అని పేరు పెట్టారు. దీని కోసం బ్రిటన్ ప్రభుత్వం 3.7 మిలియన్ పౌండ్ల నిధులు కేటాయించింది. ప్రస్తుతానికి ‘టెకోవిరిమాట్’ అనే డ్రగ్ మంకీపాక్స్‌పై పోరాడుతుందని భావిస్తున్నారు. దీనిని ప్రారంభంలో మశూచిపై పోరాడేందుకు అభివృద్ధి చేశారు. ఇది వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు శరీరంలో దాని వ్యాప్తిని అడ్డుకుంటుంది. జంతువులపై ప్రాథమిక అధ్యయనాలు మంచి ఫలితాలు చూపించిన తర్వాత దీనిని మనుషులపై ప్రయోగిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుమతులు కూడా తీసుకున్నారు. ఈ డ్రగ్‌ను కనీసం 500 మంది వాలంటీర్లపై 14 రోజుల పాటు రోజుకు రెండు సార్లు ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వచ్చిన ఫలితాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 వేల మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. చాలా మంది మరణించగా, మన దేశంలో పది కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి.