గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట. ఈ సామెత మనందరికీ తెలుసు, కానీ ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ వింత సంఘటన తెలిస్తే కొత్త సామెత పుట్టుకస్తుంది. అదేంటంటే కోతి వేషాలకు పులి పులిహోర తింటే.. పులి గాండ్రిపుకు కోతి కోమాలోకి వెళ్లిందని. అవును మహమ్మద్ ఓ అడవిలో పులి గాండ్రిపుకు ఏకంగా డజన్ వరకు కోతులు గుండెపోటుతో చనిపోయాయి.
ఈవిషయాన్ని స్వయంగా ఆ కోతులకు పోస్టుమార్టం చేసిన డాక్టర్లే చెప్పారు. అడవిలో చాలా రకాల జంతువులు జీవిస్తుంటాయి. పుట్టినప్పటినుంచి కోతులు పులి గాండ్రింపు చాలాసార్లు వినుంటాయి. కానీ ఇలా పులి గాండ్రిపునకు ఏకంగా అన్ని కోతులకు గుండె నొప్పి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఆ కోతులు పులి గర్జనకే చనిపోయాయని స్థానికులు కూడా చెబుతున్నారు.