ఆపరేషన్ కోతిపిల్ల.. అమ్మనా మజాకా!  - MicTv.in - Telugu News
mictv telugu

ఆపరేషన్ కోతిపిల్ల.. అమ్మనా మజాకా! 

May 16, 2020

 

monkey,.

తల్లి ప్రేమ మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా అదే తీరుగా ఉంటుంది. తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లి తన ప్రాణాలైనా అర్పిస్తుంది. తల్లి ప్రేమను వెలకట్టడం ఏ బిడ్డా తరం కాదు. అందుకే అంటారు తండ్రి పోయినా పిల్లలకు పెద్ద ప్రభావం పడదు కానీ, తల్లి పోతే వారి మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఈ వీడియోలో తల్లి ప్రేమను చూస్తే మీరు ఫిదా అవ్వాల్సిందే. ఓ కొండముచ్చు పిల్ల కరెంటు తీగల పైకి ఎక్కి ఎలా దిగాలో తెలియక పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. వైర్లను గట్టిగా పట్టుకుని అరుస్తోంది. ఇంటి పిట్టగోడ మీద ఉన్న తల్లి కొండముచ్చు తన బిడ్డను ఎలా రక్షించుకోవాలా అని అటూ ఇటూ చూడసాగింది. 

తొలుతు  రెండో మీదకు దూకింది. తల్లిని చూసి పిల్ల కొండముచ్చు ఆ తీగ మీదకు వచ్చింది. అయినా దానికి పిట్టగోడ మీద దూకాలంటే వణుకు పుడుతోంది. ప్రాణభయంతో అరుస్తోంది. దీంతో తల్లి మళ్లీ తీగ మీదకు దూకింది. అంతే పిల్ల వెళ్లి తల్లి పొట్టను గట్టిగా పట్టుకుంది. బిడ్డను తీసుకుని యథావిధిగా గోడ మీదకు దూకేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఆ విద్యుత్ తీగలకు పైనుంచి రబ్బరు తొడుగు ఉండబట్టి నయం అయింది.. లేదంటే వాటి ప్రాణాలు పోయేవని నెటిజన్లు అంటున్నారు.