వృద్ధుడిని రాళ్లతో కొట్టి చంపిన కోతులు.. - MicTv.in - Telugu News
mictv telugu

వృద్ధుడిని రాళ్లతో కొట్టి చంపిన కోతులు..

October 20, 2018

కోతులు కొంటే పనులు చేస్తాయని తెలుసు. ఇంట్లోకి చొరబడి ఆహారపదార్థాలు ఎత్తుకెళ్తాయని తెలుసు. కానీ కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్లిన ఓ వృద్ధిడిని రాళ్లతో కొట్టి చంపాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా టిక్రీ గ్రామంలో కలకలం రేపుతోంది. కోతులు చేస్తున్న పనికి గ్రామస్తులు భయంతో వనికిపోతున్నారు.Monkeys Stone Man To Death, Cops In Fix As Family Wants FIR ధర్మపాల్ సింగ్ (72) వంట చేసేందుకు కట్టెపుల్లలు ఏరుకునేందుకు వెళ్లాడు. వృద్ధుడిని చూసిన కోతులు అతనిపై రాళ్లతో దాడిచేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధర్మపాల్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడు ధర్మపాల్ సింగ్ సోదరుడు కోతులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తమ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. కోతులపై కేసు ఎలా పెట్టాలంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

అయితే రోజు రోజుకు కోతుల బెడద ఎక్కువ అవుతుందని, తాము ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే భయంతో వనికి పోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల భారీ నుంచి తమను ఎలాగైన కాపాడాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.