పిల్లాడిని ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లాడిని ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి

April 2, 2018

పిల్లపై వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. వాటికి కోతులు కూడా జతైనట్లు కనిపిస్తోంది. ఒడిశాలో ఓ కోతి.. 16 రోజుల వయసున్న బాబును ఎత్తుకెళ్లి చంపేసింది. కటక్ జిల్లాలోని తలబస్త పూట గ్రామంలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. సరోజినే అనే మహిళకు ఇటీవల తొలి సంతానంగా మగబిడ్డ పుట్టాడు. నెలల నిండకముందే పుట్టిన ఆ శిశువును గత నెల 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సరోజిన బాత్రూంకు వెళ్తూ దోమతెరను పైకి లేపి వెళ్లిపోయింది. తిరిగి వచ్చేసరికి  కోతి శిశువును ఎత్తుకెళ్తూ కనిపించింది. తల్లి గట్టిగా అరుస్తూ దాన్ని వెంబడించింది. అయితే కోతి ఆగకుండా పరిగెత్తి కనిపించకుండా పోయింది.తర్వాత బాధితురాలకు స్థానిక అధికారులకు మొరపెట్టుకోవడంతో వారు బిడ్డ కోసం గాలించారు. చుట్టపక్కల అడవుల్లో వెతికారు. జాగిలాలతో అన్వేషించారు. ఆదివారం సరోజిని ఇంటి పక్కనే ఉన్న బావిలో బాబు మృతదేహాన్ని గుర్తించారు. కోతే శిశువును బావిలో పడేసి ఉంటుందని భావిస్తున్నారు. పసికందులను కోతులు తమ పిల్లలుగా భావిస్తాయని, దీంతో ఇలాంటి విషాదాలు జరుగుతుంటాయని వారు చెప్పారు. కోతులను జనావాస ప్రాంతాలకు దూరంగా తరిమేయాలని స్థానికులకు సూచించారు.