చల్లని కబురు.. తగ్గనున్న ఎండలు  - MicTv.in - Telugu News
mictv telugu

చల్లని కబురు.. తగ్గనున్న ఎండలు 

May 28, 2020

thfghy

భగభగ మండుతున్న ఎండలు వీర లెవల్లో రోహిణి కార్తె రుచి చూపిస్తున్నాయి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనాలు తాయిమాయి అవుతున్నారు. ఒకటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనా కాలంలో ఇదో పరీక్ష అయిపోయింది ప్రజలకు. అయితే ఈశాన్య రాష్ట్రాలకు చల్లని ఉపశమనంలా చల్లని కబురు అందింది. జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఉపరితల శాస్త్ర మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గుతాయని శుభవార్త అందించింది. 

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ మాల్దీవులు-కొమోరిన్‌ ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్‌-నికోబార్‌ దీవులకు చేరుకున్నాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లే జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది.