ఊరిస్తూ వస్తున్న రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు రెండు, మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 7న కోస్తాంధ్ర, రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించాయని, మూడు రోజుల్లో అవి పూర్తిగా విస్తరిస్తాయని చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని తెలిపింది.
అల్పపీడనం మరో 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమలో 3,4 రోజుల పాటు మోస్తరుగా, కోస్తాంధ్రలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.