అమ్మో ఇదేం దోమ.. తూనీగ సైజులో ఉంది - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మో ఇదేం దోమ.. తూనీగ సైజులో ఉంది

January 27, 2020

Mosquito

దోమల సైజు గురించి ఎవరైనా మాట్లాడతారా? అవి చిన్న సైజులో ఉంటాయి. నలిపితే చచ్చిపోతాయి. కానీ, ఈ దోమ మాత్రం ఆ దోమలను మించింది. దోమల్లో ఇది రాక్షస దోమ అని నెటిజన్లు దీనికి పేరు కూడా పెట్టేశారు. దానిని చూస్తే తూనీగ మాదిరే ఉంటుంది. స్పెయిన్‌లోని కార్డోబ ప్రాంతంలో ఈ దోమ సంచరిస్తోందట. ఎజెక్వీల్ లోబో అనే వ్యక్తి ఈ దోమ గురించి ట్వీట్ చేశాడు. ఇది దోమేనా? లేదా ఇంకా వేరే ఏదైనా కీటకమా? మీరు ఇలాంటి జీవిని ఎక్కడైనా చూశారా? అని చనిపోయిన ఆ దోమ ఫోటోను పంచుకున్నాడు. దాని పక్కనే మామూలు దోమను కూడా పెట్టాడు. ‘ఇది మామూలు దోమ కాదు. మా ఇంటి కిటికీలోంచి గదిలోకి వచ్చింది. దాన్ని చూడగానే మా అమ్మ పురుగుల మందును స్ప్రే చేసింది. దీంతో అది చచ్చిపోయింది’ అని తెలిపాడు. అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.

దానిని చూసి యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘వామ్మో, అంత పెద్ద దోమా? అది ఖచ్చితంగా ఏలియన్ దోమే’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ దోమ కేవలం డెంగ్యూ మాత్రమే కాదు, అన్నిరకాల వ్యాధులను ఒకేసారి వ్యాప్తి చేయగలదు అని మరికొందరు పేర్కొన్నారు. ఇది రాక్షస దోమ అని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దోమ ఫోటో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ ఫోటోను 23 వేల మందికి పైగా షేర్ చేయగా, 1.4 లక్షల మందికి పైగా లైక్ చేశారు.