Moon Resort in Dubai
mictv telugu

దుబాయ్‌లో మూన్ రిసార్ట్.. భూమిపై అంతరిక్ష అనుభవం

September 12, 2022

ఎన్నో విలాసవంతమైన వస్తువులకు, ప్రదేశాలకు పేరెన్నికగన్న దుబాయ్‌లో మరో అద్భుతానికి వేదిక కాబోతోంది. డెస్టినేషన్ రిసార్ట్ తరహాలో మూన్ రిసార్ట్ బిల్డింగుని ఆ దేశం నిర్మించనుంది. సుమారు 5 బిలియన్ డాలర్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుని ఈ దశాబ్దం పూర్తయ్యేలోపు అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. కెనడాకి చెందిన ఓ ఆర్కిటెక్ కంపెనీ నిర్మిస్తున్న ఈ మూన్ బిల్డింగ్ ఎత్తు 735 అడుగులు కాగా, 48 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు అరేబియన్ బిజినెస్ పేర్కొంది. చంద్రుని ఉపరితలాన్ని పోలి ఉంగే ఈ అల్ట్రా విలాసవంతమైన హోటల్‌లో భూమిపై అంతరిక్ష అనుభూతులను పంచే విధంగా తీర్చిదిద్దనున్నారు. ఆతిథ్యం, వినోదం, ఆకర్షణలు, విద్య, సాంకేతికత, అంతరిక్ష పర్యాటకం వంటి రంగాల్లో ఈ ప్రాజెక్టు దుబాయ్ ఆర్ధిక వ్యవస్థకు మద్దతుగా ఉంటుందని నివేదికలో వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 25 లక్షల మంది పర్యాటకం కోసం వస్తారని ఓ అంచనా. ఇందులోనే నైట్ క్లబ్, గ్లోబల్ మీటింగ్ ప్లేస్, మూన్ షట్టల్, వెల్‌నెస్ సెక్షన్, స్పా వంటి సదుపాయాలతో ప్రపంచంలోనే అతిపెద్ద మోడరన్ టూరిజం ప్రాజెక్టుగా అభివర్ణించారు.