కుంగిన భూమి.. ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో పిల్లర్లు! - MicTv.in - Telugu News
mictv telugu

కుంగిన భూమి.. ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో పిల్లర్లు!

October 14, 2020

Moosapet metro pillar incident

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరద తాకిడి రోడ్లు కుంగిపోతున్నాయి. తాజాగా మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద రెండు మెట్రో పిల్లర్ల చుట్టూ రోడ్డు కుంగిపోయింది. అలాగే మెట్రో పిల్లర్ల చుట్టూ నిర్మించిన సర్ఫెజ్ వాల్ కూడా ధ్వంసమైంది. రోడ్డు కుంగిపోవడంతో మూసాపేట్‌ వద్ద వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయినా కూడా అధికారులు మెట్రో రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. 

స్టేషన్ సిబ్బంది మోటార్లు ఏర్పాటు చేసి కుంగిన భాగంలో నిలిచిన నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని గురించి  హైదరాబాద్ మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘వరదలతో మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు. కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు నుంచి భారీ వరద రోడ్లపైకి చేరింది. వరదకు మెట్రో పిల్లర్‌ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయింది. మెట్రో విషయంలో వరద ప్రభావంపై ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రజలు వందతులు నమ్మొద్దు.’ అని తెలిపారు.