Morbi Bridge Mishap:Oreva Manager Calls It 'Act of God'
mictv telugu

అంతా దైవ నిర్ణయం..మా తప్పేం లేదు..!

November 2, 2022

ఎన్నో లోపాలు…నిలువెల్లా నిర్లక్ష్యం…ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కలేదు.135 మందిని పొట్టన పెట్టుకున్నారు.ఇంకొందరి జాడ లేదు. గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనలో విస్తుగొల్పే నిజాలు బయటకొసుతున్నాయి.అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఒరేవా కంపెనీ ప్రతినిధులు కొవ్వెక్కి నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. తీగల వంతెన కూలిన ఘటనలో తమ తప్పేం లేదని, అంతా దైవ నిర్ణయం నిందితులు కోర్టులో చెప్పారు. వందశాతం వీరి నిర్లక్ష్యం వల్లే కేబుల్ బ్రిడ్జి కూలింది. వందలాది కుటుంబాల్ని రోడ్డున పడేశారు. ఇప్పుడు సిగ్గువిడిచి నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. సాక్షత్తూ ప్రధాని మోదీ ఇలాకాలోనే ఆ కంపెనీ బరితెగించి జవాబు ఇస్తుంది.

వారి జాడ ఎక్కడ?

గుజరాత్ మోర్బీ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి కూలి ఘటనలో ఇప్పటిదాకా 135 మంది చనిపోయారు. 175 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి.ఇంకా చాలా మంది జాడ తెలియదు. మచ్చు నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనలో అజంతా ఒరేవా కంపెనీకి చెందిన తొమ్మిదిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మచ్చు నది పై నిర్లక్ష్యంగా బ్రిడ్జి రీ ఓపెనింగ్ పనులు చేశారని ప్రాసిక్యూషన్ వాదించింది. ఒరేవా కంపెనీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అధికారులు కోర్టుకు నివేదించారు. ఫ్లోరింగ్ మార్చిపోయారని, అరిగిపోయిన తీగల స్థానంలో కొత్తవాటిని అమర్చలేదని ఆరోపించారు.

దేవుడిపై భారం…

ఒరేవా కంపెనీ ప్రతినిధులు చేసిందంతా చేసి తప్పంతా దేవుడి పై వేశారు. బ్రిడ్జి కూలిన ఘటన దైవ నిర్ణయమని ,తమ తప్పేం లేదని కంపెనీ ప్రతినిధి దీపక్ పరేఖ్ కోర్టు ముందు చెప్పాడు ఇలాంటి ఘటన దురదృష్టకరమని, జరగకుండా ఉండాల్సిందన్నాడు. విచారణ అనంతరం నలుగురినీ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.

ఇంకెన్నో లోపాలు

కేబుల్ బ్రిడ్జి పునరుద్దరణ పనులు చేసే ముందు ఎలాంటి తనిఖీలు చేయలేదు. అంతేకాదు నాసిరకం వస్తువుల్ని వాడారు. తెగిన తీగలతో సహా మరికొన్ని తీగలు తప్పుపట్టి ఉన్నాయి. ప్లోరింగ్ మార్చి తీగల్ని అలాగే వదిలేశారు. వాటిని సరిచేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఈ కంపెనీ సిబ్బందికి నిర్మాణం రంగంలో అనుభవం లేదు. రంగులు వేసి, పాలిష్ చేసి వదిలేశారు. వంతెన రీ ఓపెన్‌కు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. ఎంతమంది ప్రయాణించవచ్చో నిర్దారించలేదు. డిసెంబర్ దాకా గడువు ఉన్నా..నిలువెల్లా నిర్లక్ష్యంతో ముందే ఓపెన్ చేసి 135 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది.