ఒబామా ట్వీట్ కు లైక్ లే లైకు లు... - MicTv.in - Telugu News
mictv telugu

ఒబామా ట్వీట్ కు లైక్ లే లైకు లు…

August 16, 2017

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్వీట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యాల పై నెటిజన్లు పిధా అయిపోతున్నారు.తన పోస్టుకు లైక్ లమీద లైక్ లు వస్తున్నాయట. అత్యధిక లైక్ లు పొందిన పోస్టు గా చరిత్ర సృష్టించింది. ఇటీవల వర్జీనియాలో చోటు చేసుకున్న జాతి వివక్ష దాడుల గురించి ఒబామా స్పందింస్తూ… పుట్టేటప్పుడు ఎవరూ ఇతరులను ద్వేషిస్తూ జన్మించలేదు.

చర్మం , రంగు, నేపథ్యం, మతాన్ని బట్టి వివక్ష చూపించడం పుట్టుకతో వచ్చినది కాదు అని అన్నారు. నెల్సన్ మండేలా జీవిత చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నుంచి ఒబామా ఈ మాటలను కోట్ చేశారు. దానితో పాటు వివిధ వర్ణాల పిల్లలతో తాను ఫోటో దిగి పోస్టు చేశారు. ఈ పోస్టును ఈ నెల12న పోస్టు చేయగా దాదాపుగా ఇప్పటికే 29 లక్షల మంది లైక్ చేశారు. 46 వేల మంది కామెంట్స్ చేయగా, 11 లక్షల మందికి పైగా రీట్వీట్ చేశారట.