US Winter Storm : అమెరికాలో మంచు తుఫాన్...1300కంటే ఎక్కువ విమానాలు రద్దు..!! - Telugu News - Mic tv
mictv telugu

US Winter Storm : అమెరికాలో మంచు తుఫాన్…1300కంటే ఎక్కువ విమానాలు రద్దు..!!

February 23, 2023

అమెరికాలో మంచు తుఫాను విమానాలపై తీవ్ర ప్రభావం చూపింది. యునైటెడ్ స్టేట్స్‌లో మంచు తుఫాను కారణంగా బుధవారం 1,300 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. అమెరికాలోని పశ్చిమ, మధ్య రాష్ట్రాల్లో తీవ్రమైన మంచు తుఫాను ప్రభావం ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు యునైటెడ్ స్టేట్స్ లోపల, వెలుపల మొత్తం 1,327 విమానాలు రద్దు చేశారు. ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ FlightAware ప్రకారం, USలో 2,030 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. గత నెలలో కూడా అమెరికాలో మంచు తుపాను కారణంగా చాలా రోజులుగా విమానాల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం నాడు, ప్రతికూల వాతావరణం కారణంగా మిన్నెసోటా తోపాటు ఇతర రాష్ట్రాల్లో గ్రేట్ లేక్స్, దక్షిణ మైదానాల మీదుగా విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. గంటకు రెండు అంగుళాల వరకు మంచు కురుస్తుంది. బలమైన గాలులు ఉత్తర మైదానాలు, ఎగువ మిడ్‌వెస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రయాణ పరిస్థితులను ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొంది.