more-than-30-killed-in-trains-collision-in-greece
mictv telugu

ఢీకొట్టుకున్న ప్యాసింజర్ రైలు, కార్గో రైలు, 32 మంది సజీవదహనం

March 1, 2023

more-than-30-killed-in-trains-collision-in-greece

గ్రీస్ లో చాలా పెద్ద ప్రమాదం జరిగింది. రెండు రైళ్ళు ఢీకొన్నాయి. ఇందులో 32 మంది సజీవదహనమయ్యారు. మరో 85 మంది గాయాలపాలయ్యారు. నిన్న జరిగిన ఈ దుర్ఘటన గ్రీస్ లోని తెంపీ దగ్గరలో జరిగింది. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళుతున్న ఓ ప్యాసింజర్ రైలు, మరో కార్గో రైలు రెండూ గుద్దుకున్నాయి.

ప్యాసింజర్ రైల్ లో మొదట మూడు బోగీల్లో మంటలు చెలరేగి 32 మంది ప్రయాణికులు అక్కడిక్కడే చనిపోయారు. మిగతా బోగీలు కూడా పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ రైలు దాదాపు 350 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 200మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడగలిగారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు బోగీలకు మంటలు అంటుకుని, మరో దానికి వ్యాపించాయి. దట్టమైన పొగలు, విరిగిన కిటికీలు, రోడ్డుపై అడ్డంగా శిథిలాలు.. అందులో చిక్కుకున్న ప్రయాణీకుల కోసం చేతుల్లో టార్చి లైట్లతో వెతుకుతున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలంలోని దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

చుట్టూ చిమ్మ చీకట్లు మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో సహాయకచర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రైళ్ళు ఢీకొట్టిన తర్వాత ఉలిక్కిపడ్డామని, భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుడు ఒకరు చెబుతున్నారు.