ఒలంపిక్స్ వద్దేవద్దు.. టోక్యో ప్రజలు - MicTv.in - Telugu News
mictv telugu

ఒలంపిక్స్ వద్దేవద్దు.. టోక్యో ప్రజలు

July 4, 2020

Tokyo

కరోనా వైరస్ దెబ్బకి మేజర్ ఈవెంట్లు ‌అన్నీ ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లో జరగాల్సిన ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా పడగా, తాజాగా ఈ ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్ కూడా సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. ఈ నెల 23న ప్రారంభం కావాల్సిన ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ వైరస్ ప్రభావం అప్పటివరకు కూడా తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. 

ఈ క్రమంలో టోక్యో ప్రజలు స్పందిస్తున్నారు. వచ్చే ఏడాది కూడా మా దగ్గర ఈ గేమ్స్ నిర్వహించవద్దు అని ముక్తకంఠంతో అంటున్నారు. తాజాగా టోక్యోలోని ఓ స్థానిక సంస్థ నిర్వహించిన సర్వేలో 51.7 శాతం మంది టోక్యో ప్రజలు వచ్చే ఏడాది కూడా ఒలంపిక్స్ జరపకుండా వాయిదా వేయాలి అని అభిప్రాయం వెలిబుచ్చారు. కాగా, ఇప్పటివరకు జపాన్‌లో దాదాపు 20,000 మంది కరోనా బారిన పడగా, 976 మంది మృత్యువాత పడ్డారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించి పోయిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా అనేక కార్యక్రమాలు, సినిమా షూటింగులు, ఆటలు, సమావేశాలు.., ఇలా అన్నీ వాయిదా పడ్డాయి.