మందుబాబులకు శుభవార్త.. హాంగోవర్ వదిలిస్తుంది - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు శుభవార్త.. హాంగోవర్ వదిలిస్తుంది

May 16, 2019

రాత్రి ఫుల్లుగా తాగి.. పొద్దున లేవగానే తలనొప్పితో పాటు హాంగోవర్ వస్తుంది. అలా అది తగ్గేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. ఇక నుంచి అలా తిప్పలు పడాల్సిన అవసరం లేకుండా మార్కెట్లోకి సహజ సిద్ధమైన డిటాక్స్ డ్రింక్ వచ్చేసింది. బుధవారం హెల్త్‌లైన్ అనే సంస్థ హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది.

ఈ డ్రింక్‌ను మల్బరీ ఆకులు, విలమిన్ వంటి సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేస్తామని, దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని కంపెనీ ప్రకటించింది. మద్యం సేవించిన తర్వాత ఈ డ్రింక్ తాగితే మరుసటి రోజు ఉదయం ఎలాంటి హాంగోవర్ ఉండదని తెలిపింది. అంతేకాదు ఇది లివర్ లోని చెడు పదార్థాలను శుభ్రంచేసి, అల్కాహాల్ త్వరగా జీర్ణమయ్యేలా చేస్తోందని తెలిపింది.

ఇప్పటికే ఈ డ్రింక్ బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల్లో విజయవంతమైందని ఇప్పుడు దీన్ని హైదరాబాద్ లోని బార్లు, సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ డ్రింక్ పుదీనా, స్ట్రాబెరీ, కోలా, దాల్చిన ఫ్లేవర్లలో లభిస్తోంది. 60 మిల్లీలీట‌‌ర్ల బాటిల్ ధ‌‌ర రూ.125 ఉంటుంది.

దీనిపై కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ నగరాల్లో ఈ డ్రింక్ సరఫరా చేసేందుకు బిగ్ బజార్, రత్నదీప్ వంటి రిటైలర్లతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ డ్రింక్ ప్రస్తుతం బెంగళూరులోని ప్లాంటు‌లో తయారు చేస్తున్నట్లు తెలిపారు.