ఉస్మానియాలో మార్చురీ సిబ్బంది వీరంగం.. డబ్బులు ఇస్తేనే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఉస్మానియాలో మార్చురీ సిబ్బంది వీరంగం.. డబ్బులు ఇస్తేనే..

May 31, 2022

హైదరాబాద్‌లో ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో మార్చురీలో విధులు నిర్వహించే సిబ్బంది వీరంగం సృష్టించారు. డబ్బులు ఇస్తేనే.. శవాన్ని మార్చురీకి తీసుకెళ్తామని లంచం డిమాండ్‌ చేశారు. దాంతో మృతుడి బంధువులు డబ్బులెందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని సర్థి చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”చాదర్‌ఘాట్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఇటీవలే మజీద్‌ అనే వ్యక్తి సూసైడ్‌ చేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెయ్యి రూపాయలు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది డిమాండ్ చేయడంతో గొడవ మొదలైంది. తాగిన మత్తులో ఉన్న మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులపై నానా మాటల తిడుతూ, వాళ్లపై జులుం ప్రదర్శించారు.”

ఈ క్రమంలో మంగళవారం మద్యం మత్తులో మార్చురీ సిబ్బంది సృష్టించిన గొడవకు ఆసుపత్రి అధికారులు సమాధానాలు చెప్పాలని మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. అనారోగ్యంతో ఉస్మానియా కొస్తే, పేద వారి దగ్గర సిబ్బంది డబ్బులు వసూలు చేయటం ఏంటని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శవాలతోటీ భేరాలు ఆడాటం ఏంటనీ ఆసుపత్రి అధికారులను నిలుదీస్తున్నారు.