దేశంలోని మసీదులు గుడులపై నిర్మించినవే.. ఇత్తెహాద్ మిల్లత్ సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలోని మసీదులు గుడులపై నిర్మించినవే.. ఇత్తెహాద్ మిల్లత్ సంచలన వ్యాఖ్యలు

May 18, 2022

జ్ఞానవాపి మసీదుపై నిర్వహించిన వీడియో సర్వేలో శివలింగం బయటపడిందన్న విషయం తెలిసినప్పటి నుంచి వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఈ అంశంపై యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ అధ్యక్షుడు తాఖీర్ రజా స్పందించారు. దేశంలో చాలా మసీదులు కట్టడానికి ముందు అవన్నీ ఆలయాలేనని స్పష్టం చేశారు. ఆలయాలను కూల్చి మసీదులు నిర్మించలేదని, ప్రజలు ఇస్లాంలోకి మారిపోయి ఆలయాలను మసీదులుగా మార్చారని వ్యాఖ్యానించారు. అలాంటి మసీదుల జోలికి వెళ్లవద్దని, బలవంత చర్యలకు పూనుకుంటే ముస్లింలు వ్యతిరేకిస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎవ్వరూ కూడా న్యాయపోరాటం చెయ్యకూడదని తెలిపారు. బాబ్రీ మసీదుపై ఎలాంటి తీర్పు వచ్చిందో గుర్తు తెచ్చుకొని, జ్ఞానవాపిపై కేసులు వేయవద్దన్నారు. ఒకవేళ వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తమకు తెలుసని అన్నారు. దేశంలో విద్వేషాన్ని రగిల్చేవారు అన్ని మసీదుల్లో శివలింగాలను కనుగొంటారని, వాళ్లు తలచుకుంటే ఏదైనా జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల ముస్లింలు శాంతియుతంగా ఉండాలని హితవు పలికారు.